ఫీగా ఇండస్ట్రియల్‌ ఇంజనీర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సు

ABN , First Publish Date - 2021-06-30T10:38:44+05:30 IST

కేంద్ర ప్రభుత్వ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువతకు ఇండస్ట్రియల్‌ ఇంజనీర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సును ఉచితంగా అందించనున్నారు.

ఫీగా ఇండస్ట్రియల్‌ ఇంజనీర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సు

హైదరాబాద్‌, జూన్‌  29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ దీన్‌  దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువతకు ఇండస్ట్రియల్‌ ఇంజనీర్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సును ఉచితంగా అందించనున్నారు. కేంద్ర జౌళి శాఖ అధీనంలోని అపెరల్‌ ట్రైనింగ్‌ అండ్‌ డిజైన్‌  సెంటర్‌ (ఏటీడీసీ) ఈ శిక్షణను అందించనుంది. హైదరాబాద్‌లోని ఏటీడీసీ కేంద్రంలో అందించే ఈ కోర్సులో చేరే వారికి ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. వివరాలకు ఏటీడీసీ, సర్వే నం. 64, నెక్స్ట్‌ గలేరియా మాల్‌, హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌  పక్కన, మాదాపూర్‌, హైదరాబాద్‌లో సంప్రదించాలని కోరారు.  

Updated Date - 2021-06-30T10:38:44+05:30 IST