‘ఎఫ్‌బీవో’ పరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2021-06-22T08:09:36+05:30 IST

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో) ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను టీఎ్‌సపీఎస్సీ ఎట్టకేలకు విడుదల చేసింది.

‘ఎఫ్‌బీవో’ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):  ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో) ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను  టీఎ్‌సపీఎస్సీ ఎట్టకేలకు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రెండేళ్ల తర్వాత ఫలితాలను ప్రకటించింది. మొత్తం 340 మంది అభ్యర్థులను ఎఫ్‌బీఓ పోస్టులకు ఎంపిక చేసింది. హైకోర్టులో కేసులు, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ధ్రువపత్రాల విషయంలో వివాదాల వల్ల మిగతా పోస్టులను పెండింగ్‌లో పెట్టామని వివరించింది. వీటికీ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను త్వరలోనే ఎంపికచేస్తామని తెలిపింది. అర్హులు లేకపోవడం వల్ల ఒక పోస్టును భర్తీ చేయలేదని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. 

Updated Date - 2021-06-22T08:09:36+05:30 IST