ఎడ్లబండి మీదినుంచి పడి రైతు మృతి

ABN , First Publish Date - 2021-06-22T04:51:38+05:30 IST

ఎడ్లబండి మీదినుంచి పడి రైతు మృతి

ఎడ్లబండి మీదినుంచి పడి రైతు మృతి
చలపతిరావు (ఫైల్‌)

సంగెం, జూన్‌ 21: వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండితో వెళ్లిన రైతు అదే ఎడ్ల బండి కింద పడి మృతి చెందిన ఘట న రాంచంద్రాపురంలో చోటుచేసుకుంది. సంగెం పోలీసుల క థనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుంచికాల చలపతిరావు (70) భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం వ్యవసాయ పనులకో సం ఎడ్లబండితో భూమి వద్దకు వెళ్లాడు. పనులు ముగించు కొని తిరిగి ఎడ్లబండిపై వస్తుండగా ప్రమాదవశాత్తు కిందప డడం, తలపై నుంచి బండిచక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సంగెం పోలీసులకు కుమారుడు దేవేందర్‌రావు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనాథ్‌ తెలిపారు. 


Updated Date - 2021-06-22T04:51:38+05:30 IST