రోడ్డుపై బైఠాయించిన రైతులు
ABN , First Publish Date - 2021-10-26T04:53:53+05:30 IST
రోడ్డుపై బైఠాయించిన రైతులు

మహదేవపూర్ రూరల్, అక్టోబరు 25 : మండలంలోని బెగ్లూర్-1, బెగ్లూర్-2 ఇసుక క్వారీలకు వెళ్లే రహదారిలో దుమ్మూ దూళితో పంటలు నాశన మవుతున్నాయని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఎల్‌అండ్‌టీ రోడ్డు నుంచి ఇసుక క్వారీలకు వెళ్లే లారీలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సు మారు రెండున్నరపాటు ఆందోళన చేపట్టగా క్వారీ నిర్వాహకులు, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. వారం రోజుల్లో పంటలకు నష్టప రిహారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.