పరిహారం రాలేదని నిర్వాసిత రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-27T10:07:54+05:30 IST

సాగునీటి ప్రాజెక్టు కోసం తన భూమిని తీసుకొని న్యాయం చేయలేదనే ఆవేదనతో ఓ నిర్వాసితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సున్నపుతండాలో ఈ ఘటన

పరిహారం రాలేదని నిర్వాసిత రైతు ఆత్మహత్య

పాలమూరు పథకంలో మునిగిన ఆరెకరాలు 

2017 నుంచి న్యాయం చేయాలంటూ వేడుకోలు


కొల్లాపూర్‌ రూరల్‌, ఆగస్టు 26: సాగునీటి ప్రాజెక్టు కోసం తన భూమిని తీసుకొని న్యాయం చేయలేదనే ఆవేదనతో ఓ నిర్వాసితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సున్నపుతండాలో ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన రైతు బాలు నాయక్‌కు(50) చెందిన ఆరెకరాల భూమి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. అప్పట్లోనే పరిహారం ఇచ్చినా, న్యాయం కోసం 2017 నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ఆయన తిరుగుతున్నాడు. తననెవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఇతర రైతులతో కలిసి చాలాసార్లు పనులను కూడా అడ్డుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో తన కుమారుడు చందలాల్‌ నాయక్‌ పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.    

Updated Date - 2021-08-27T10:07:54+05:30 IST