ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2021-02-06T04:18:47+05:30 IST

ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న రైతులు

ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న రైతులు
గుంజేడులో రైతులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ తాహెర్‌బాబా

కొత్తగూడ, ఫిబ్రవరి 5 : మండలంలోని గుంజేడులో అటవీశాఖ అధికారులు చేపట్టిన ట్రెంచ్‌ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. సరిహద్దు కందకం తీసేందుకు అటవీశాఖాధికారులు ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చి ట్రెంచ్‌ తవ్వేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తహెర్‌బాబా అక్కడికి చేరుకొని రైతులను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖాధికారులు ట్రెంచ్‌ ఎలా తీస్తారని రైతులు ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులను నిలిపివేసి ఎక్స్‌కవేటర్‌తో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

Updated Date - 2021-02-06T04:18:47+05:30 IST