‘నకిలీ పట్టాలు సృష్టించి వేధిస్తున్నారు...’

ABN , First Publish Date - 2021-10-30T05:11:19+05:30 IST

‘నకిలీ పట్టాలు సృష్టించి వేధిస్తున్నారు...’

‘నకిలీ పట్టాలు సృష్టించి వేధిస్తున్నారు...’
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ, కుటుంబం

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 29: తమ భూమికి నకిలీ పట్టాలు తయా రు చేసి, తమపైనే అధికారులు, నా యకులు కేసులు పెట్టి వేధిస్తున్నారని కలెక్టర్‌ బి.గోపికి సంగెం మండలానికి చెందిన పిడుగు లక్ష్మి, తన కుటుంబ సభ్యులతో కలిసి మొరపెట్టుకుంది. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు లక్ష్మి మాట్లాడుతూ తమ భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి, అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. గతంలో ఉన్న కలెక్టర్‌ను నాలుగుసార్లు కలిసి గోడు వెల్లబోసుకున్నానని, ప్రస్తుత కలెక్టర్‌ గోపికి సైతం పరిస్థితిని విన్నవించుకున్నట్టు పేర్కొంది.

Updated Date - 2021-10-30T05:11:19+05:30 IST