పోలీస్‌ నియామకాల పేరిట నకిలీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-04-04T08:23:13+05:30 IST

పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి నకిలీ నోటిఫికేషన్‌ వెలువడింది. పోలీస్‌ శాఖలోని ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీ పేరుతో 3.4.2021 తేదీతో పోలీస్‌ నియామక బోర్డు పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

పోలీస్‌ నియామకాల పేరిట నకిలీ నోటిఫికేషన్‌

సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి నకిలీ నోటిఫికేషన్‌ వెలువడింది. పోలీస్‌ శాఖలోని ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీ పేరుతో 3.4.2021 తేదీతో పోలీస్‌ నియామక బోర్డు పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అప్పుడో, ఇప్పుడో పోలీస్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో నకిలీ నోటిఫికేషన్‌ ప్రచారంలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2018లో పోలీస్‌ నియామక బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌లో తేదీ ఒక్కటే మార్చి సో షల్‌ మీడియాలో ప్రచారం చేశారు. రెండు రోజుల క్రితం రాత్రివేళ లాక్‌డౌన్‌ పేరుతో నకిలీ జీవో వెలువడింది. సీసీఎస్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ నోటిఫికేషన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్థమవుతున్నారు.

Updated Date - 2021-04-04T08:23:13+05:30 IST