నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను తయారు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-03T18:24:24+05:30 IST

నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ కుమార్, రంజిత్ కుమార్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు

నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను తయారు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్: నకిలీ హార్పిక్, లైజాల్ బాటిళ్లను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ కుమార్, రంజిత్ కుమార్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు హార్పిక్, లైజాల్ స్టిక్కర్ల బాటిళ్లను ఉపయోగించి నకిలీ ఫ్లోర్, బాత్రూం క్లీనర్లను తయారు చేశారు. ఆ కంపెనీ అధికారుల ఫిర్యాదుతో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో ప్రధాన నిందితుడు సంతోష్... 1440 హార్పిక్, 576 లైజాల్ అర లీటరు బాటిళ్ళు, మూడు బండిల్ల లైజర్ స్టిక్కర్లు, 100 హార్పిక్ లేబుల్ షీట్లు, 5 డ్రమ్ముల లిక్విడ్ లైజాల్, ప్యాకింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-07-03T18:24:24+05:30 IST