ఎగ్జిట్‌ పోల్స్‌లో హవా ఎవరిదో తేలిపోయింది!

ABN , First Publish Date - 2021-10-31T08:47:08+05:30 IST

హుజూరాబాద్‌ ఓటరు పట్టం కట్టనుంది టీఆర్‌ఎ్‌సకా? బీజేపీకా? ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం ఈ ఫలితం ,,,,,

ఎగ్జిట్‌ పోల్స్‌లో హవా ఎవరిదో తేలిపోయింది!

  • ఎగ్జిట్‌ పోల్స్‌లో ఈటలదే హవా! 
  • ఐదు సంస్థలది అదేమాట..
  • టీఆర్‌ఎస్‌దే పైచేయి అన్న మరో సంస్థ


హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఓటరు పట్టం కట్టనుంది టీఆర్‌ఎస్‌కా? బీజేపీకా? ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం ఈ ఫలితం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే అనుకూలమని పేర్కొన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించిన ఆరు సంస్థల్లో ఐదు సంస్థలు బీజేపీదే హవా అని స్పష్టం చేశాయి. బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య 7-10 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు అంచనా వేశాయి. మరో సంస్థ మాత్రం టీఆర్‌ఎస్‌ పైచేయి సాధించనున్నట్లు పేర్కొంది.


కాగా, ఈ ఉప ఎన్నికలో కీలక నేతగా ఈటల ఇమేజ్‌ పనిచేసిందని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి రూపంలో కాకుండా ఆయనను చూసే ఓటు వేసినట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో గత శాసనభ్యుడిగా ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రజలకు సేవాభావంతో సహకరించడం వంటి అంశాలతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించిన సానుభూతి పనిచేసిందని భావిస్తున్నారు. ప్రధానంగా ఈటలకు నిరుద్యోగులు, యువత అండగా నిలచినట్లు చెబుతున్నారు.Updated Date - 2021-10-31T08:47:08+05:30 IST