రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి..

ABN , First Publish Date - 2021-12-27T05:27:51+05:30 IST

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి..

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి..
మాట్లాడుతున్న మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి

 జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ 

హనుమకొండ రూరల్‌, డిసెంబరు 26: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం హంటర్‌రోడ్‌లోని గణపతి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రావుపద్మ పార్టీ జెండాను ఆవిష్కరించి సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్‌ వి.మురళీధర్‌గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ మేయర్‌ డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జిల్లా, మండల, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:27:51+05:30 IST