కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2021-12-29T05:19:05+05:30 IST

కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
నర్సింహులపేటలో కార్యకర్తల శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారావు

మాజీ ఎమ్మెల్యే ధర్మారావు

నర్సింహులపేట, డిసెంబరు 28 : సీఎం కేసీఆర్‌ కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమ యం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మార్థినేని ధర్మారావు అన్నా రు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ పం డపంలో డోర్నకల్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల రెండురోజుల శిక్షణను మంగళవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆ దరణకు సీఎం కేసీఆర్‌ వెన్నులో వణుకు పుడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్ల పాలన అవినీతి మయంగా  మారిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు,  రాష్ట్ర నాయకుడు పెదగాని సోమయ్య, జిల్లా ప్రాధాన కార్యదర్శి చీకటి మహే ష్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సుధాకర్‌, ధర్మాపరు వెంకన్న, మైదం సురేష్‌ పాల్గొన్నారు. కా ర్యక్రమంలో పార్టీ జిల్లా మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ఉన్నారు.  

Updated Date - 2021-12-29T05:19:05+05:30 IST