రైతుల పేరుతో కేసీఆర్ ధర్నాలు హాస్యాస్పదం: ఈటల
ABN , First Publish Date - 2021-11-29T03:03:31+05:30 IST
కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో అన్నారు. రైతుల పేరుతో ..

భద్రాద్రి: కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో అన్నారు. రైతుల పేరుతో కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంపై నింద వేసి కేసీఆర్ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం.. చరిత్రలో బాగుపడ్డ దాఖల్లాలేవని ఈటల వ్యాఖ్యానించారు.