మంత్రి కేటీఆర్‌కు ఈటల కౌంటర్..

ABN , First Publish Date - 2021-08-25T19:53:46+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నేడు ఈటల మీడియాతో మాట్లాడుతూ... ‘‘హుజురాబాద్‌లో గెలిచినా, ఓడినా ఏమీ కానప్పుడు..

మంత్రి కేటీఆర్‌కు ఈటల కౌంటర్..

కరీంనగర్ : మంత్రి కేటీఆర్‌కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నేడు ఈటల మీడియాతో మాట్లాడుతూ... ‘‘హుజురాబాద్‌లో గెలిచినా, ఓడినా ఏమీ కానప్పుడు.. ప్రగతి భవన్, రంగనాయక సాగర్ నుంచి తోడేళ్ల మందలాగా దాడి ఎందుకు చేస్తున్నారు? కేటీఆర్‌కు ఇప్పటికైనా తెలిసి వచ్చింది. ఎన్ని చిల్లర పనులు చేయాలో అన్ని చేస్తున్నారు. అంబేద్కర్‌కు ఏనాడైనా పూల మాల వేశారా అని ఆనాడే ప్రశ్నించా. కేసీఆర్‌కు దళితుల మీద ప్రేమ లేదు.. వారి ఓట్ల మీదనే ప్రేమ. దళితులకు ఎన్ని చేసినా కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదు. బీసీ, ఎస్టీ అధికారులను కూడా సీఎంవోలో నియమించాలి. సీఎం సభలో మాట్లాడిన మహిళలను ట్రేస్ చేసి వారితో కేసీఆర్ మళ్లీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ దిగజారుడు విధానానికి ఇది కారణం. సిద్దిపేట మంత్రి ఇక్కడే అడ్డా పెట్టిండు. వందలాది మందిని ఇక్కడ డంప్ చేసిండు’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2021-08-25T19:53:46+05:30 IST