చంపుకుంటారో-సాదుకుంటారో మీ ఇష్టం : ఈటల భావోద్వేగం
ABN , First Publish Date - 2021-10-29T19:14:04+05:30 IST
హుజూరాబాద్ ఉపఎన్నిక మరికొద్ది గంటల్లో జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
వరంగల్ : హుజూరాబాద్ ఉపఎన్నిక మరికొద్ది గంటల్లో జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కాగా.. ఈటల రాజేందర్ నేడు వరంగల్‌కు చేరుకున్నారు. హోటల్ గ్రాండ్ గాయత్రిలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ విలేకరుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈటలను హోటల్ లోపలికి రాకుండా ఏసీపీ గిరి కుమార్, పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను వారించి రాజేందర్‌ను బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి, రావు పద్మ తదితరులు హోటల్ లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈటల భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రజలతో 19ఏళ్ల బంధం నాది. చంపుకుంటరో-సాదుకుంటరో మీఇష్టం నేను చచ్చినా బతికినా మీవెంటే’ అని ఆవేదన చెందారు.