హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల విజయం

ABN , First Publish Date - 2021-11-02T23:45:37+05:30 IST

ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ..

హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల విజయం

హుజూరాబాద్: ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. 22వ రౌండ్‌లో బీజేపీకి 4481 ఓట్లు రాగా టీఆర్ఎస్ 3351 ఓట్లు సాధించింది. దీంతో ఈటల రాజేందర్ 1,130 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా ఈటల రాజేందర్‌కు 1 లక్షా 07 వేల 022 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167ఓట్లు వచ్చాయి. 2004 నుంచి వరుసగా ఈటల రాజేందర్ 7సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


ఇక ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులర్పించి స్వీట్స్ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-11-02T23:45:37+05:30 IST