పరిశీలనలో దళిత వర్సిటీ ఏర్పాటు: కొప్పుల
ABN , First Publish Date - 2021-03-24T08:38:56+05:30 IST
రాష్ట్రంలో దళిత యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళిత యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సభలో పద్దులపై ఆయన మాట్లాడుతూ, దళిత వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో ఈ యూనివర్సిటీ ప్రతిపాదన ఉందని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. కాగా, ఎస్సీ జనాభా ప్రతిపాదిక ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. వక్ఫ్ భూముల రక్షణకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 6077 మందికి నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు.