ఇనుగుర్తిని మండలంగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-01-13T03:58:16+05:30 IST
ఇనుగుర్తిని మండలంగా ప్రకటించాలి

మహబూబాబాద్ టౌన్, జనవరి 12 : ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయకుంటే జనవరి 26న గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆమరణ దీక్షకు దిగుతామని ఇనుగుర్తి మండల సాధన సమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మం త్రులు, సీఎం ఇచ్చిన మండల ఏర్పాటు హామీని నిలబెట్టుకోవాలని ఇనుగుర్తి మండల సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇనుగుర్తి టూ మహబూబాబాద్‌కు (30 కిలోమీటర్లు) శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో కందాల రంగయ్య, నోముల నాగేశ్వర్‌రావు, వెంకటేష్, ధీకొండ నరేందర్, మామిడాల వీరన్న, సతీష్, అజయ్‌కుమార్, అంజలి, శ్యామల పాల్గొన్నారు.