బైక్‌తో గర్భిణిని ఢీకొట్టిన ఇంజినీరింగ్ విద్యార్థి.. అక్కడికక్కడే మృతి

ABN , First Publish Date - 2021-06-22T17:20:24+05:30 IST

మియాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. 8 నెలల గర్భిణిని బైక్‌తో ఇంజినీరింగ్..

బైక్‌తో గర్భిణిని ఢీకొట్టిన ఇంజినీరింగ్ విద్యార్థి.. అక్కడికక్కడే మృతి

హైదరాబాద్: మియాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. 8 నెలల గర్భిణిని బైక్‌తో ఇంజినీరింగ్ విద్యార్థి డీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆమె గర్భం కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు మియాపూర్ పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.


Updated Date - 2021-06-22T17:20:24+05:30 IST