తెలంగాణకు ఇంధన పొదుపు పురస్కారం

ABN , First Publish Date - 2021-01-12T09:08:30+05:30 IST

ఇంధన పొదుపునకు తీసుకుంటున్న చర్యలకుగాను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సరెడ్‌కో)కు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రెండో పురస్కారం అందించింది. 2019-20

తెలంగాణకు ఇంధన పొదుపు పురస్కారం

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపునకు తీసుకుంటున్న చర్యలకుగాను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సరెడ్‌కో)కు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రెండో పురస్కారం అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ సంస్థల కేటగిరీలో తొలి పురస్కారం కేరళ.. రెండోది హరియాణా, తెలంగాణ రాష్ట్రాల సంస్థలు అందుకున్నాయి. సోమవారం వర్చుల్‌ విధానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ నుంచి టీఎ్‌సరెడ్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానయ్య ఈ అవార్డును అందుకున్నారు. 


దక్షిణ మధ్య రైల్వేకు మూడు అవార్డులు

దక్షిణ మధ్య రైల్వేకు మూడు జాతీయ స్థాయి ఇంధన పొదుపు అవార్డులు లభించాయి. 30వ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని 2020సంవత్సరానికిగాను బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ఈ అవార్డులను ప్రకటించింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ నుంచి సోమవారం వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌ ఈ అవార్డులను స్వీకరించారు. ఇండస్ట్రీ/రైల్వే వర్క్‌షాప్స్‌ కేటగిరీలో విజయవాడలోని డీజిల్‌ లోకోషెడ్‌ మొదటి బహుమతి, భవనాలు/ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో ద.మ. రైల్వే లేఖా భవనం రెండో బహుమతి, ట్రాన్స్‌పోర్ట్‌/జోనల్‌ రైల్వే కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-01-12T09:08:30+05:30 IST