పాలచెలమ గుట్టల వద్ద ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2022-01-01T02:07:05+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలచెలమ గుట్టల ప్రాంతంలో శుక్రవారం కోబ్రా

పాలచెలమ గుట్టల వద్ద ఎన్‌కౌంటర్‌

దుమ్ముగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలచెలమ గుట్టల ప్రాంతంలో శుక్రవారం కోబ్రా 208 బెటాలియన్‌, మావోయిస్టుల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పాలచెలమ గుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బసచేశారనే సమాచారం మేరకు బలగాలు అక్కడకు తరలివెళ్లాయి. గంటన్నరకుపైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగ్గా, ఆ సమయంలో ఘటనాస్థలంలో 70మంది వరకు మావోయిస్టులు ఉండి ఉంటారని, వారిలో చాలామంది మావోయిస్టులు గాయపడి ఉంటారని, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కాగా కోబ్రా జవాను వీరేంద్రసింహ్‌కు తూటాలు బాగా తగిలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోబ్రా బలగాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు బ్యాకప్‌ పార్టీలు సంఘటనా స్థలానికి బయల్దేరగా.. పాలచెలమ గుట్టల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ను సుక్మా ఎస్పీ సునీల్‌శర్మ ధ్రువీకరించారు. 

Updated Date - 2022-01-01T02:07:05+05:30 IST