సీఎస్‌‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

ABN , First Publish Date - 2021-01-20T23:57:02+05:30 IST

సీఎస్‌‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

సీఎస్‌‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

హైదరాబాద్: సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. అనంతరం టీఎన్‌జీవో అధ్యక్షుడు రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు 3 రోజుల్లో ఉద్యోగ సంఘం నేతల్ని పిలుస్తామని సీఎస్‌ అన్నారని, వారంలోపే మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరామన్నారు. ఉద్యోగులు చాలా అసహనంగా ఉన్నారని, ఉద్యోగాల భర్తీ త్వరగా చేపట్టాలని కోరామని రాజేందర్ తెలిపారు.


మరోవైపు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు నాన్చుతూ వచ్చిన కమిటీతో ఇంకా చర్చించేదేముంటుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కనీసం తమకు పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేదని, పీఆర్సీ సిఫారసులు తెలియనప్పుడు కమిటీతో చర్చించి ఫలితం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అసలు పీఆర్సీ నివేదికను తెరిచారో లేదో తెలియదని ఉద్యోగ  నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి ద్వారా నివేదికను ఓపెన్‌ చేయిస్తామంటూ సీఎస్‌ తమకు చెప్పారని, కానీ... ఓపెన్‌ చేయించారో లేదో ఆయనకే తెలియాలని చెబుతున్నారు. 
Updated Date - 2021-01-20T23:57:02+05:30 IST