ఎల్లుండి అల్ప పీడనం
ABN , First Publish Date - 2021-05-20T07:24:30+05:30 IST
ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీనికి యాస్ తుపానుగా నామకరణం చేశారు. ఈ నెల 26న బెంగాల్, ఒడిసా మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలో గురువారం ఆకాశం మేఘావృత్తమె ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది.