విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-09T05:52:59+05:30 IST

విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

విద్యుత్‌ సవరణ చట్టాన్ని  ఉపసంహరించుకోవాలి
విద్యుత్‌ భవన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యుత్‌ జేఏసీ నాయకులు

  తెలంగాణ విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ జాన్సన్‌ 

రెవెన్యూ కాలనీ, డిసెంబరు 8 : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ జాన్సన్‌ అన్నారు. బుధవారం హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్‌ భవన్‌ ఎదుట కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాన్సన్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తోందని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు.  విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  దేవేందర్‌రెడ్డి, బండారు ప్రభాకర్‌, గులాంరబ్బానీ, అక్బర్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ ఇంజనీర్స్‌, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో..

విద్యుత్‌ ఇంజనీర్స్‌, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్‌ భవన్‌ ఎదుట విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ నాయకులు సామ్యానాయక్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోమని హెచ్చరించారు.  కార్యక్రమంలో జేఏసీ నాయకులు నార్ల సుబ్రమణ్యేశ్వర్‌రావు, శశికుమార్‌, రంగారావు, ఆనందం, ఆర్‌.నవీన్‌, మధుసూదన్‌రావు, కళాధర్‌రెడ్డి, వేణునాయక్‌, మహమూద్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో

హనుమకొండ ములుగురోడ్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఒకవేళ పార్లమెంటులో విద్యుత్‌ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, దేవా, కుమారస్వామి, యాకూబ్‌, సందీప్‌, ప్రశాంత్‌, మహేశ్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:52:59+05:30 IST