ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం వసతులు కల్పించండి

ABN , First Publish Date - 2021-01-20T09:14:58+05:30 IST

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లండ్‌

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం వసతులు కల్పించండి

ఇంధన శాఖ కార్యదర్శితో యూకే రాయబారి ఫ్లెమింగ్‌


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లండ్‌ రాయబారి డాక్టర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఇంధన శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సౌర విద్యుత్‌ ఉత్పాదనతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనల మౌలిక వసతులపై వారు చర్చించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని  ఫ్లెమింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట యూకే రాయబార కార్యాలయ ప్రతినిధి సుస్మితా రామోజీ కూడా ఉన్నారు.

Updated Date - 2021-01-20T09:14:58+05:30 IST