పొలంలో కరెంటు షాక్‌.. ఇద్దరు రైతుల మృతి

ABN , First Publish Date - 2021-03-24T08:59:46+05:30 IST

పొలంలో కరెంటు షాక్‌ తగిలి ఇద్దరు రైతులు చనిపోయారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తమొల్ల ఆనంద్‌(38) ఎకరం భూమిని కౌలుకు తీసుకొని జొన్నలు వేశాడు.

పొలంలో కరెంటు షాక్‌.. ఇద్దరు రైతుల మృతి

అల్లాదుర్గం/కౌడిపల్లి, మార్చి 23: పొలంలో కరెంటు షాక్‌ తగిలి ఇద్దరు రైతులు చనిపోయారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తమొల్ల ఆనంద్‌(38) ఎకరం భూమిని కౌలుకు తీసుకొని జొన్నలు వేశాడు. సోమవారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆనంద్‌ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చేను వద్ద విగత జీవిగా పడి ఉన్నాడు. అతడి చేతిలో కరెంటు ఫ్యూజు ఉండడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు భావిస్తున్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లి తండాకు చెందిన కాట్రోత్‌ సీతారం(60) సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఓ పొలం వద్ద అడవి పందుల నుంచి పంట కోసం రక్షణగా వేసిన విద్యుత్‌ తీగలు తగిలి చనిపోయాడు. కరెంటు తీగలను ఏర్పాటు చేసిన తండాకు చెందిన కాట్రోత్‌ శక్రుపై మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-03-24T08:59:46+05:30 IST