సీఎంగా ఈటలే ప్రత్యామ్నాయం

ABN , First Publish Date - 2021-02-05T08:40:32+05:30 IST

‘కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే మంత్రి కేటీఆర్‌కు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సీఎంగా కేటీఆర్‌ కంటే మంత్రి ఈటల రాజేందరే సరైన ప్రత్యామ్నాయం’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు...

సీఎంగా ఈటలే ప్రత్యామ్నాయం

  • ఎమ్మెల్యేలూ మద్దతిస్తారు: జీవన్‌రెడ్డి


హైదరాబాద్‌, ఇల్లెందు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే మంత్రి కేటీఆర్‌కు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సీఎంగా కేటీఆర్‌ కంటే మంత్రి ఈటల రాజేందరే సరైన ప్రత్యామ్నాయం’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ సమర్థుడే అయినా.. ఆయనకు వారసుడనే విమర్శ ఉందన్నారు. ఇది తన అభిప్రాయం కాదని, ప్రజల అభిప్రాయమని వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. సబ్బండ వర్గాల నేతగా ఈటల రాజేందర్‌ను సీఎంను చేయాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2021-02-05T08:40:32+05:30 IST