తెలంగాణలోని పలు జిల్లాలో భూ ప్రకంపనలు

ABN , First Publish Date - 2021-11-01T01:37:10+05:30 IST

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల

తెలంగాణలోని పలు జిల్లాలో భూ ప్రకంపనలు

హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. ఒక సెకను పాటు కంపించిన భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంత్రం సమయం 6-48 నిమిషాలకు లక్షెటిపేట‌తో పాటు సమీప ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.  ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. 


Updated Date - 2021-11-01T01:37:10+05:30 IST