టీఆర్ఎస్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: దుర్గా ప్రసాదరావు

ABN , First Publish Date - 2021-11-02T19:09:38+05:30 IST

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని టీడీపీ నేత అన్నారు.

టీఆర్ఎస్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: దుర్గా ప్రసాదరావు

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని టీడీపీ నేత దుర్గా ప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ డబ్బులు, ప్రలోభాలు పనిచేయలేదని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. టీఆర్ఎస్‌కు మెజారిటీ రాలేదంటే.. అర్థమేంటన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా వచ్చినట్లు కనబడుతోందని దుర్గా ప్రసాదరావు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-02T19:09:38+05:30 IST