టీఎస్‌పీఎస్సీ పేరుతో నకిలీ మెయిల్‌ ఐడీ

ABN , First Publish Date - 2021-03-14T08:13:00+05:30 IST

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేరుతో దుండగులు నకిలీ ఈ-మెయిల్‌ ఐడీని సృష్టించారు.

టీఎస్‌పీఎస్సీ పేరుతో నకిలీ మెయిల్‌ ఐడీ

‘తెలంగాణ డిజిటల్‌ మీడియా’కు మెయిల్స్‌

సీసీఎస్ లో టీఎస్‌పీఎస్సీ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేరుతో దుండగులు నకిలీ ఈ-మెయిల్‌ ఐడీని సృష్టించారు. ఆ ఐడీతో తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగానికి సందేశాలు పంపారు. పౌరసరఫరాల శాఖ, తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(టీఎస్‌పీఎస్సీ)తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో కొలువులు ఉన్నాయని మెయిల్స్‌ పంపించారు. ఆ సందేశాలను చూసిన డిజిటల్‌ మీడియా విభాగం శనివారం టీఎస్‌పీఎస్సీకి సమాచారం ఇచ్చింది. టీఎ్‌సపీఎస్సీ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌ వెంటనే హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా,  టీఎస్ పీఎస్సీకి helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ ఐడీ ఉంది. దాని ద్వారానే అభ్యర్థులు అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఆ మెయిల్‌ ఐడీ ద్వారా ఉద్యోగ సమాచారం అభ్యర్థులకు గానీ, ఇతర సంస్థలకు వెళ్లదు. అభ్యర్థులకు నగదు లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు  tspscpayments@gmail.com మరొక మెయిల్‌ ఐడీ ఉంది. ఈ రెండింటి ద్వారా మాత్రమే టీఎస్‌పీఎస్సీ కార్యాకలపాలు కొనసాగిస్తోంది. అయితే, మెయిల్‌ ఐడీ చివరలో ్టటఞటఛి.జౌఠి.జీుఽ వచ్చేలా నకిలీది సృష్టించినట్లు ఫిర్యాదులో వాణీప్రసాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-14T08:13:00+05:30 IST