Drunken Driveపై కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-10-28T12:22:37+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి, మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు

ఖమ్మం: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి, మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారితో పాటు వారి కుటుంబసభ్యులకు బుధవారం కమాండ్ కంట్రోల్‌లోని ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్పలితాలను తెలిపారు. హెల్మెట్‌వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ద్విచక్ర వాహనదారులకు ఎన్ని ప్రయోజనాలున్నాయో వాహనదారులకు వివరించారు. రోడ్లపై వాహనాలు నిలపవద్దని, రాంగ్‌పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసుస్టేషన్లకు తరలించి జరిమానా విధిస్తున్నామని తెలిపారు.