ఔషధాల అక్రమ దందా!

ABN , First Publish Date - 2021-05-21T08:54:01+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి వేళ మందులకు ఏర్పడిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని.. రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న

ఔషధాల అక్రమ దందా!

డాక్టర్‌ సహా ఎనిమిది మంది అరెస్టు 


హైదరాబాద్‌ సిటీ, వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాప్తి వేళ మందులకు ఏర్పడిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని.. రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న డాక్టర్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.బ్లాక్‌ ఫంగస్‌ వైద్యానికి ఉపయోగించే యాంఫొట్రిసిన్‌ బీ ఇంజెక్షన్లను అమ్ముతున్న ముగ్గురికి బేడీలు వేశారు. గురువారం హైదరాబాద్‌లో పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న బహదూర్‌పురాకు చెందిన అక్బర్‌ఖాన్‌ (22), బండ్లగూడకు చెందిన ముజఫర్‌ఖాన్‌ (22), ఆసి్‌ఫనగర్‌కు చెందిన హకీముద్దీన్‌ (31), వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సైదుద్దీన్‌ (32)లను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 6 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.


హన్మకొండ కొత్తబ్‌సస్టేషన్‌ సమీపంలోని రాజు ఈఎన్‌టీ ఆస్పత్రిలో పోలీసులు దాడులు చేసి, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న డాక్టర్‌ అజ్మీర రాజును అరెస్టు చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే యాంఫొట్రిసిన్‌ బీ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తుండగా.. పంజాగుట్ట పోచమ్మబస్తీకి చెందిన ఫలారం కాశయ్య (23), మాదాపూర్‌కు చెందిన సుగాలి వినోద్‌కుమార్‌ (23), ఎర్రగడ్డలో మెడికల్‌షాపు నిర్వాహకుడు మహ్మద్‌ ఖాజా నిజాం(30)లను అరెస్టు చేసి, ఐదు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-05-21T08:54:01+05:30 IST