నర్సరీల నిర్వహణపై శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2021-12-31T19:31:39+05:30 IST

నర్సరీల పెంపుకు ఆయా గ్రామాల్లోని సర్పంచులు, జీపీ కార్యదర్శులు శ్రద్ధ తీసుకోవాలని డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు అన్నారు.

నర్సరీల నిర్వహణపై శ్రద్ధ చూపాలి

సంగెం. డిసెంబరు 30 : నర్సరీల పెంపుకు ఆయా గ్రామాల్లోని సర్పంచులు, జీపీ కార్యదర్శులు శ్రద్ధ తీసుకోవాలని డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు అన్నారు. గురువారం లోహిత, షాపురం, పెద్దతండా గ్రామాల్లో ఆయన మండల అధికారుతో కలసి నర్సరీలను పరిశీలించారు. మొక్కల పెంపకంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని తెలిపారు. గ్రామాలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో మల్లేశం గౌడ్‌, ఎంపీవో కొమురయ్య, ఈజీఎస్‌ ఏపీవో లక్ష్మి సర్పంచ్‌లు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T19:31:39+05:30 IST