సైన్స్‌ సాహిత్య సృష్టికర్త డాక్టర్‌ దేవరాజు

ABN , First Publish Date - 2021-12-31T08:39:14+05:30 IST

కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న దేవరాజు మహరాజు సైన్స్‌ను, సాహిత్యాన్ని కలగలిపి శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేస్తున్న ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు డాక్టరు దేవరాజు మహరాజు.

సైన్స్‌ సాహిత్య సృష్టికర్త డాక్టర్‌ దేవరాజు

కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న దేవరాజు మహరాజు సైన్స్‌ను, సాహిత్యాన్ని కలగలిపి శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేస్తున్న ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు డాక్టరు దేవరాజు మహరాజు. ఆయన స్వస్థలం  యాదాద్రి భువనగిరి జిల్లాలోని వడపర్తి.  జీవ పరిణామ సిద్ధాంతంతో పాటు మానవ పరిణామ క్రమంలోని వివిధ దశలు, శరీర నిర్మాణం, వలసలు తదితర అంశాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పిల్లల పాత్రలతో  ‘నేను అంటే ఎవరు?’ నాటకాన్ని రాశారు. జువాలజీ ఆచార్యుడిగా పదవీ విరమణ చేశారు. బాలసాహిత్యం, కథా సంకలనాలు, నాటికలు, నాటకాలతో పాటు పలు వైజ్ఞానిక రచనలు చేశారు. సాహిత్య విశ్లేషణలు, సినిమా విమర్శలు రాశారు. పాపులర్‌ సైన్స్‌ పేరుతో సుమారు 40 పుస్తకాలు రాశారు. నోబెల్‌ గ్రహీత స్టెయిన్‌ బెక్‌ నవలను ‘మంచి ముత్యం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

Updated Date - 2021-12-31T08:39:14+05:30 IST