సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-31T06:03:40+05:30 IST

సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత

కాటారం, అక్టోబరు 30 :గ్రామపంచాయతీల సమగ్రాభి వృద్ధికి అధికారులు, పాలకవర్గాలు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అన్నారు. కాటారం మండలంలోని దామెరకుంట గ్రామపంచా యతీని ఆమె శనివారం సందర్శించారు.  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జీపీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పలు వాడల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో జీపీ కార్యదర్శి శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడూ రికార్డులను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, పారిశుధ్య నిర్వాహణ నిరంతరం చేపట్టాలని సర్పంచ్‌ రఘువీర్‌కు సూచించారు. ఆమె వెంట ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-31T06:03:40+05:30 IST