ప్రతి కుటుంబానికి పని కల్పించాలి : డీపీవో
ABN , First Publish Date - 2021-01-21T04:17:52+05:30 IST
ప్రతి కుటుంబానికి పని కల్పించాలి : డీపీవో

కన్నాయిగూడెం, జనవరి 20: మండలంలోని ప్రతి కుటుంబానికి మార్చి 31 లోగా 100 రోజుల ఉపాఽధి హామీ పని కల్పించాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆదేశించారు. కన్నాయిగూడెంలోని మానవ వనరుల కేంద్రం భవనంలో బుఽధవారం ఉపాఽధి హామీ పథకం, పల్లెప్రగతి పనులపై కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీపీవో వెంకయ్య మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో బాబు, ఏపీవో చరణ్‌రాజ్, ఎంపీవోలు కుమార్, హన్మంతు పాల్గొన్నారు.