ఇరిగేషన్ శాఖలో డీపీసీ!
ABN , First Publish Date - 2021-01-12T09:38:42+05:30 IST
ఇరిగేషన్ శాఖలో నాన్ టెక్నికల్ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు

హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఇరిగేషన్ శాఖలో నాన్ టెక్నికల్ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి పరిపాలన విభాగపు ఈఎన్‌సీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ, సచివాలయంలో ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. కాగా, పునర్వ్వవస్థీకరణ అనంతరం ఇటీవల ఇంజనీర్ల పదోన్నతులను పూర్తి చేశారు. నాన్ టెక్నికల్ ఉద్యోగుల పదోన్నతులను ఇవ్వాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖలో మొదటి, రెండో స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ)ని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీసీ మెంబర్ కన్వీనర్‌గా ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌ను, సభ్యులుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, సచివాలయంలోని డిప్యూటీ/జాయింట్/అడిషనల్ సెక్రటరీని నియమించారు. ఇప్పటికే పదోన్నతుల సీనియారిటీ జాబితా సిద్ధమైంది. డీపీసీ ఫైనల్ చేయాల్సి ఉంటుంది.