పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-08-20T17:46:54+05:30 IST

జిల్లాలోని పేదలకు..

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

కలెక్టర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వినతి


హనుమకొండ రూరల్‌: జిల్లాలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో సీపీఐ బృందం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, కాజీపేట, ధర్మసాగర్‌, వేలేరు, హసన్‌పర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు, మూడెకరాల భూమి ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా నాయకులు తోట భిక్షపతి, మోతె లింగారెడ్డి, మద్దెల ఎల్లేశ్‌, బుస్సా రవీందర్‌, ఎలేందర్‌, మల్లయ్య, రోహిత్‌, భిక్షపతి, గుండె బద్రి, నరేశ్‌, నాగరాజు, మైసయ్య పాల్గొన్నారు.Updated Date - 2021-08-20T17:46:54+05:30 IST