హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2021-03-22T23:44:20+05:30 IST

హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కుచ్చుటోపీ

హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కుచ్చుటోపీ

హైదరాబాద్: వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలకు ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టారు. లక్షలు, కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. కలెక్టర్ కార్యాలయంలో పీఏ నంటూ ఒకే కుటుంబానికి చెందిన పది మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం రూ.2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు ఇప్పిస్తావంటూ పదే పదే అడిగే సరికి నిందితుడు సుబ్రహ్మణ్యం రాత్రికి రాత్రే పరారయ్యారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. జరిగిన మోసాన్ని గ్రహించి వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేటుగాడు సుబ్రహ్మణ్యంతో పాటు అతని సొంత బావమర్దిపై కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-22T23:44:20+05:30 IST