వీరికి టీకాలొద్దు!
ABN , First Publish Date - 2021-01-12T08:50:34+05:30 IST
కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. కానీ, కొందరు మాత్రం దానికి దూరంగా ఉంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనిపై తాజాగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

కొవిడ్ వ్యాక్సిన్ ఎవరికి ప్రమాదమో
స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో
హైదరాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. కానీ, కొందరు మాత్రం దానికి దూరంగా ఉంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనిపై తాజాగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అందులో.. ఎవరెవరు టీకాకు దూరంగా ఉండాలో స్పష్టతనిచ్చింది.
వీరు టీకాలకు దూరంగా ఉంటే మంచింది
ఏ మందు తీసుకున్నా తీవ్రమైన అలర్జీ వచ్చే వారు.. కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటే మంచిది. జూగర్బిణీలు కొవిడ్ సోకే హైరిస్కు జాబితాలోకి వస్తారని, అయినప్పటికీ.. ఈ విషయంలో తగినంత సమాచారం లేనందున వీరు కొవిడ్ టీకాకు దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ గర్బిణీ హెల్త్‌వర్కర్ అయివుంటే, వ్యాక్సినేటర్‌తో సంప్రదించాక తీసుకోవాలని సూచించింది. తల్లి పాలిచ్చే బాలింతలకు కూడా ఇదే వర్తిస్తుందని పేర్కొంది. అలాగే.. టీకా తీసుకున్న మహిళలు కనీసం 2-3 నెలల పాటు గర్భధారణకు దూరంగా ఉంటే మంచిదని తెలిపింది.
16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు టీకా ఇవ్వకూడదు.
హెచ్‌ఐవీ రోగులకు కరోనా ముప్పు చాలా ఎక్కువ. క్లినికల్ ట్రయల్స్ నుంచి హెచ్‌ఐవీ రోగులకు సంబంధించిన పరిమితమైన డేటా మాత్రమే అందుబాటులో ఉందని, కావున వ్యాక్సిన్ ఇచ్చేముందు వారికి విషయాన్ని తెలియజేయాలంది.