కారు అద్దాలు పగులగొట్టి విలువైన పత్రాల అపహరణ

ABN , First Publish Date - 2021-01-13T12:29:23+05:30 IST

రోడ్డుపై నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న విలువైన పత్రాలను గుర్తుతెలియని

కారు అద్దాలు పగులగొట్టి విలువైన పత్రాల అపహరణ

హైదరాబాద్/అమీర్‌పేట : రోడ్డుపై నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న విలువైన పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోయిన్‌పల్లికి చెందిన రాంచందర్‌రావు ఈఎస్ఐ సమీపంలో భాను ఎన్‌క్లేవ్‌లో కొరియర్‌ సర్వీస్‌ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న మెట్రోకెమిక్‌ ఫార్మా కంపెనీ నుంచి ఫోన్‌ చేసి మీకు పార్శిల్‌ వచ్చింది.. తీసుకెళ్లాలని రాంచందర్‌రావుకి తెలిపారు. ఉదయం 10 గంటలకు భాను ఎన్‌క్లేవ్‌ వద్ద కారు నిలిపి పార్శిల్‌ తీసుకుని వచ్చే లోపు కారు వెనుక అద్దాలు పగులగొట్టి ఉన్నాయి. కారులో ఉన్న ఫార్మా కంపెనీకి చెందిన శాంపిల్స్‌తోపాటు విలువైన పత్రాలు కనిపించకపోవడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువకులు కారు అద్దాలు పగులగొట్టడం కెమెరాల్లో రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-13T12:29:23+05:30 IST