మా టీచర్లను బదిలీ చేయొద్దు

ABN , First Publish Date - 2021-12-30T08:09:45+05:30 IST

‘‘మా ఉపాధ్యాయులను మా పాఠశాలలోనే పని చేయనివ్వాలి. వారిని బదిలీ

మా టీచర్లను బదిలీ చేయొద్దు

హుస్నాబాద్‌, డిసెంబరు 29: ‘‘మా ఉపాధ్యాయులను మా పాఠశాలలోనే పని చేయనివ్వాలి. వారిని బదిలీ చేయొద్దు’’ అంటూ బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. 317 జీఓను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీచర్లను బదిలీ చేయొద్దంటూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు పీడీ రాజమల్లయ్య, రవీందర్‌, రవీందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, రజిత, కవితను ఇదే పాఠశాలలో కొనసాగించాలని విద్యార్థులు కోరారు. 

Updated Date - 2021-12-30T08:09:45+05:30 IST