ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులను ఖాళీ చేయించొద్దు

ABN , First Publish Date - 2021-06-22T08:10:59+05:30 IST

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది.

ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులను ఖాళీ చేయించొద్దు

సెప్టెంబరు 6వరకు ఆదేశాలు పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):  మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏటిగడ్డకిష్టాపూర్‌ రైతులకు అనుకూలంగా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబరు 6వరకు పొడిగించింది.  పూర్తి పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసేదాకా భూముల్లోకి చొరబడరాదని,  బలవంతంగా ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు, రిప్లయ్‌ కౌంటర్లు వేయాలని వాది, ప్రతివాదులను సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశించింది.

Updated Date - 2021-06-22T08:10:59+05:30 IST