కలెక్టర్లు విధులు నిర్వహించరా?: నిరంజన్
ABN , First Publish Date - 2021-05-08T08:32:51+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించకుండా..

హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించకుండా.. ఎప్పుడో కబ్జా అయిన భూమికి సంబంధించి విచారణ బాధ్యత ముగ్గురు కలెక్టర్లపైన పెట్టారని గవర్నర్ తమిళిసైకి టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎ్‌సను వివరణ కోరి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిపై మాత్రమే దృష్టి సారించాలంటూ కలెక్టర్లను ఆదేశించాలని శుక్రవారం గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు.