వైద్యులు అంకితభావంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-01-14T04:04:10+05:30 IST

వైద్యులు అంకితభావంతో పనిచేయాలి

వైద్యులు అంకితభావంతో పనిచేయాలి
రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో అప్పయ్య

డీఎంహెచ్‌వో అప్పయ్య 

వెంకటాపురం(నూగూరు), జనవరి 13: ఏజెన్సీలోని వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య అన్నారు. మండలంలోని ఎదిర, వెంకటాపురం వైద్యశాలలను బుధవారం సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగనున్నందున వ్యాక్సినేషన్‌కు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఎదిర, వెంకటాపురం వైద్యశాలల్లో రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు, సిబ్బందికి వివరించారు. ఆయన వెంట వైద్యాధికారులు అల్లి నరేష్‌, నంబి కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-01-14T04:04:10+05:30 IST