తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-10-08T00:36:48+05:30 IST

తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డీకే అరుణ

తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డీకే అరుణ

మహబూబ్‌నగర్: తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అరుణ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-08T00:36:48+05:30 IST