కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-02-26T20:32:06+05:30 IST

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతోంది మంత్రి కేటీఆరా? అని డీకే అరుణ ప్రశ్నించారు.

కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి: డీకే అరుణ

హైదరాబాద్‌: పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతోంది మంత్రి కేటీఆరా? అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామని చెప్పుకోవడం సరికాదన్నారు. కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని గతంలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగం పెరిగిందే తప్ప తగ్గలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే యూనివర్సిటీలో చర్చకు రావాలని డీకే అరుణ సవాల్ చేశారు.

Updated Date - 2021-02-26T20:32:06+05:30 IST