మూడేళ్లలో రూ.3,385 కోట్ల రైతు బీమా పరిహారం పంపిణీ

ABN , First Publish Date - 2021-11-23T09:23:03+05:30 IST

రాష్ట్రంలో రైతులు ఏ కారణంగా మృతి చెందినా రూ.5 లక్షల బీమా పరిహారం పంపిణీ చేస్తున్నామని, మూడేళ్లలో 67,699 మంది రైతులు చనిపోతే రూ.3,385 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మూడేళ్లలో రూ.3,385 కోట్ల రైతు బీమా పరిహారం పంపిణీ

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు ఏ కారణంగా మృతి చెందినా రూ.5 లక్షల బీమా పరిహారం పంపిణీ చేస్తున్నామని, మూడేళ్లలో 67,699 మంది రైతులు చనిపోతే రూ.3,385 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసే రాష్ట్రం ప్రపంచంలో తెలంగాణ మినహా వేరే రాష్ట్రం లేదన్నారు. సాగు చట్టాల రద్దు కోసం పోరాడి చనిపోయిన రైతులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంపై కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులను పట్టించుకోవటం లేదని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అన్నదాతలకు స్వర్ణయుగం కొనసాగుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-11-23T09:23:03+05:30 IST