ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసులు కొట్టివేత

ABN , First Publish Date - 2021-10-29T01:57:45+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన కేసులను కొట్టివేస్తూ ప్రజా

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసులు కొట్టివేత

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన కేసులను కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది.  రాజాసింగ్‌పై ఉన్న మూడు కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. రెయిన్‌బజార్, అఫ్జల్‌గంజ్, సరూర్‌నగర్‌లో నమోదైన కేసులను కొట్టివేసింది. ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టేలా ప్రసంగించారని రాజాసింగ్‌పై వివిధ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. 

Updated Date - 2021-10-29T01:57:45+05:30 IST