కాంగ్రెస్ నేతలపై కేసులు కొట్టివేత
ABN , First Publish Date - 2021-10-21T10:13:27+05:30 IST
2018లో హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) భవన్ ముందు అనుమతి లేకుండా..
2018లో హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) భవన్ ముందు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జీ.విజయరామారావు, సిరిసిల్ల రాజయ్య నిందితులుగా ఉన్నారు. అలాగే.. అదే సందర్భంగా సంగారెడ్డిలో ప్రదర్శన నిర్వహించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నమోదైన కేసును కూడా కోర్టు కొట్టివేసింది.